నామినేషన్ ఫారం పూరించేందుకు తెలుగు, ఇంగ్లిష్ భాషలు మాత్రమే ఉపయోగించవలెను.
స్వీయ నామినేషన్లు అంగీకరించబడవు. థర్డ్ వ్యక్తులు/సంస్థలచే పంపబడు నామినేషన్లు మాత్రమే అంగీకరించబడును.
గత సంవత్సరం అవార్డు పొందిన విజేతలు మళ్లీ ఈ సంవత్సరం అవార్డుల కొరకు దరఖాస్తు చేయరాదు.
సంస్థలు కాక, అవార్డుల కొరకు విడిగా దరఖాస్తు చేసుకొను వ్యక్తులు.. ‘ఇండివిడ్యుయల్’ గా మార్క్ చేయబడిన కేటగిరీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు చేసుకొను వ్యక్తులు/ సంస్థలు సమైక్య ఆంధ్రప్రదేశ్ (2-6-2014వ తేదీకి ముందున్నట్టి) రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రంలో సేవ చేయుటకు ఆసక్తి లేదా చొరవ కలిగియుండవలెను.
అన్ని సెక్షన్లూ పూరించిన ఫారమ్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడతాయి. అసంపూర్తిగా ఉన్న ఫారమ్లు పరిగణలోకి తీసుకొనబడవని గ్రహించగలరు. ఒకవేళ ఫారంలోని అంశాలలో ఏదైనా మీకు వర్తించని ఎడల లేదా ఏదైనా అంశానికి సమాధానం ఇవ్వనవసరం లేదని మీరు భావించిన ఎడల, దయచేసి అక్కడ.. ‘వర్తించదు’ అని పేర్కొనగలరు.
ప్రతి నామినేషన్లో నామినేటర్ సంతకంతో కూడిన స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి.
నామినేటర్, 1 ఫైలు వరకు, తమ చర్య లేదా చొరవ/ కొత్త అంశం యొక్క ప్రభావాన్ని తెలియజెప్పే ఆధారాలను సమర్పించవచ్చు.
ఏప్రిల్, 30, 2024 వ తేదీ సాయంత్రం 6 గం.ల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరించబడును.
ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనుటకు అవసరమైన మరిన్ని సూచనల కొరకు www.sakshiexcellenceawards.com వెబ్సైట్లో పేర్కొనబడిన నియమ నిబంధనలు చూడగలరు.
ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం అంటే, వారు సంబంధిత నియమ నిబంధనలను అంగీకరించినట్లుగానే పరిగణించబడును.
ప్రతి కేటగిరీలోనూ అవార్డు విజేతను జ్యూరీ ఎంపిక చేస్తుంది. ఈ విషయంలో జ్యూరీదే తుది నిర్ణయం. దరఖాస్తుదారులందరూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండవలెనని గ్రహించగలరు.
ఈ ఫారంలో పేర్కొనబడిన సమాచారమంతయూ గోప్యంగా ఉంచబడును. ఈ సమాచారం.. అవార్డుకు ఎంట్రీ ఎంతవరకు అర్హతమైనదన్న అంశాన్ని పరిశీలించుటకు మాత్రమే ఉపయోగించబడును.
పూర్తిగా పూరించబడిన నామినేషన్లను పోస్ట్ లేదా కొరియర్ల ద్వారా, లేదా స్వయంగా అందజేయవలెను.